Share News

పనులను వేగవంతం చేయండి

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:43 PM

నగరంలో రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆదేశించారు.

పనులను వేగవంతం చేయండి
మాట్లాడుతున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): నగరంలో రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆదేశించారు. మంగళవారం నగర పాలక సమావేశ భవనంలో ప్లానింగ్‌ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కిడ్స్‌ వరల్డ్‌ నుంచి బుధవారపేట బ్రిడ్జి, అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి పెద్ద మార్కెట్‌ వరక, కల్లూరు సంత మార్కెట్‌ నుంచి మహవీర్‌ కాలనీ వరకు రహదారుల విస్తరణ పనులతో పాటు పెద్దపాడు- ఏ.నాగలాపురం రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయా లని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇనచార్జి డీసీపీ షభ్నం శాసి్త్ర, ఏసీపీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: పారిశుధ్య నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నగర పాలక సంస్థ కమిషనర్‌ పారిశుధ్య పర్యవేక్షక సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం నగరంలోని పలు చోట్ల చేపడుతున్న పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. పాతబస్తీలోని నెహ్రూ రోడ్డు అపరిశుభ్రంగా ఉండటంపై పారిశుద్ద్య పర్య వేక్షక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మిచెట్టు సమీపంలోని హంద్రీ నది పరివాహక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా జొహరాపు రంలో పుష్‌కార్డులో చెత్త వదిలేసి ఉండటాన్ని గమనించిన కమిషనర్‌ శానిటరీ ఇనస్పెక్టర్‌, సెక్రటరీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని అన్న క్యాంటీనను తనిఖీ చేశారు. ఆయన వెంట శానిటరీ ఇనస్పెక్టర్లు అనిల్‌కుమార్‌, మల్లికార్జున, వలి, రాజు, శివశంకర్‌ ఉన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:43 PM