భూసేకరణను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:21 AM
గుంతకల్లు-గుంటూరు రైల్వే మార్గంలో చేపడుతున్న డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధింత అధికారులను ఆదేశించారు.
నంద్యాల కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): గుంతకల్లు-గుంటూరు రైల్వే మార్గంలో చేపడుతున్న డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధింత అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గుంతకల్లు- గుంటూరు రైల్వే మార్గంలో చేపడుతున్న డబ్లింగ్‌పై గుంతకల్లు కన్‌స్ట్రక్షన్స్ డీవై.సీఈ సంతో్‌షకుమార్, ఎస్‌ఎ్‌సఈ వర్క్స్ గుంతకల్ కన్‌స్ట్రక్షన్ ఆనంద్‌కుమార్, ఏహెచ్‌ఈఎన్, కన్‌స్ట్రక్షన్స్ డోన్ భగవాన్ దాస్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 2 ఎకరాల 32 సెంట్ల భూమికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతిలో ఉందని తెలిపారు. గతంలో కోర్టు పరిధిలో ఉన్న కేసులకు సంబంధించి సంబంధిత అధికారులతో కలిసి ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. భూసేకరణకు సంబంధించిన అంశాలను వేగంగా పరిష్కరించి, రైల్వే డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.