Share News

ఎన్నికలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:10 AM

మున్సిపల్‌ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. ఆదోనిలో మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.

ఎన్నికలపై ప్రత్యేక దృష్టి
స్ట్రాంగ్‌ రూమ్‌నురూంను పరిశీలిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఏఎస్పీ జయశర్మ

ఆదోనిలో స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించిన ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఏఎస్పీ జయశర్మ

ఆదోని, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. ఆదోనిలో మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూమ్‌లను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదోని ఏఎస్పీ జయశర్మ, మున్సిపల్‌ కమిషనర్‌ నయూమ్‌ అహమ్మద్‌తో కలిసి పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా స్ర్టాంగ్‌ రూమ్‌లలో భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంలు లేదా బ్యాలెట్‌ బాక్సుల భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు తీరు తెన్నులను అధికారులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి చిన్నపాటి లోపాలు లేదా సంఘటనలు కూడా తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాజశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, రామలింగమయ్య, నల్లప్ప, గౌస్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 12:10 AM