సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:37 AM
ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలు, కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు.
ఎస్పీ విక్రాంత పాటిల్
ఓర్వకల్లు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలు, కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని మీదివేముల, నన్నూరు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా నిఘా, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న ముందస్తు చర్యల ను ఆయన పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లును చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు ఎస్ఐ సునీల్ కుమార్ ఉన్నారు.