ఆలయాల్లో రాష్ట్ర లోకాయుక్త ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:08 AM
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గలో వెలసిన బుగ్గ రామేశ్వరస్వామిని ఆదివారం రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ టి.మల్లికార్జునరావు దర్శించుకున్నారు.
ఓర్వకల్లు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గలో వెలసిన బుగ్గ రామేశ్వరస్వామిని ఆదివారం రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ టి.మల్లికార్జునరావు దర్శించుకున్నారు. కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ కాటినేని నారాయణ, ధర్మకర్త దేవేంద్ర, ప్రధాన అర్చకుడు కల్లె లక్ష్మీనారాయణ శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత మల్లికార్జునరావు ఆలయంలో శివుడికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం అధికారులు, అర్చకులు ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించారు. అంతకుముందు జస్టిస్ మల్లికార్జునరావు కొమ్ముచెరువు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అక్కడ నిర్వాహకులు రమేశ్, అర్చకులు సన్మానించారు. కాల్వబుగ్గలో రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ధర్మకర్తలు, టీడీపీ నాయకులు రామాంజనేయులు, రవికుమార్ పాల్గొన్నారు.