వంద శాతం ఉత్తీర్ణతకు ప్రత్యేక ప్రణాళిక
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:20 AM
జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు డీఈవో జనార్దనరెడ్డి తెలిపారు.
డీఈవో జనార్దనరెడ్డి
శిరివెళ్ల, జనవరి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు డీఈవో జనార్దనరెడ్డి తెలిపారు. మం డలంలోని మహ దేవపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్‌ను ఆయన బుధవారం ఉదయం పరిశీలించారు. వంద రోజుల ప్రణాళికను ప్రతి పాఠశాలలో పక్కాగా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయన వెంట హెచఎం రమణమ్మ, ఆంగ్ల ఉపాధ్యాయుడు రంగస్వామి ఉన్నారు.