బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:52 PM
బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ డా.ఏ. సిరి పేర్కొన్నారు.
కర్నూలు కలెక్టరేట్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ డా.ఏ. సిరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో బాల్య వివాహ ముక్త్ భారత్ - 100 రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహ విముక్త రథాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం బాల్య వివాహ ముక్త్ భారత్ పేరుతో వంద రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింద న్నారు. ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్, ఐసీడీఎస్ పీడీ విజయ, సీడీపీవోలు పాల్గొన్నారు.