Share News

ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:34 PM

మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి
మాట్లాడుతున్న మంత్రి ఫరూక్‌

న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైౖర్మన్‌ మౌలానా షేక్‌ ముస్తాక్‌ అహ్మద్‌తో కలిసి ఆయన మాట్లాడారు. మైనార్టీ యువత నిరుద్యోగులుగా ఉండరాదని ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఉద్యోగావకాశాలు కల్పించాలనే సం కల్పంతో ఈనెల 11న విజయవాడలో ముసాపీర్‌ ఖానా (పంజా సెంటర్‌)లో భారీ మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈజాబ్‌మేళాలో సుమారు 60 నుంచి 70 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 11:34 PM