గుర్రపు డెక్క నివారణకు ప్రత్యేక డ్రైవ్: కమిషనర్
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:56 AM
నదుల్లో ఉన్న గుర్రపు డెక్కల నివారణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.
కర్నూలు న్యూసిటీ, మార్చి 14(ఆంధ్రజ్యోతి): నదుల్లో ఉన్న గుర్రపు డెక్కల నివారణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం ఆయన సంక ల్‌బాగ్ సమీ పంలోని తుంగభద్ర నదిలో శుభ్రత పనులు, లార్విసైడ్ ఆయిల్ పిచికారీ పనులను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ నగర పరిఽధిలో తుంగభద్ర, హంద్రీ, కేసీ కెనాల్ నదులు ఉన్నాయని, నదుల్లో పిచ్చి మొక్క లు, చెత్త పేరుకుపోయి దోమలు పెరగడానికి అనుకూల పరిస్థితులు ఉన్న ప్రదేశాల్లో ముందుగా శుభ్రత పనులు చేపడుతున్నామని అన్నారు. అనంతరం గుర్రపు డెక్కల నివారణకు డ్రోన సహాయంతో లార్విసైడ్ ఆయిల్ పిచికారీ చేస్తున్నామన్నారు. ప్రజారోగ్య అధికారి డా.నాగప్ర సాద్ బాబు, డీఈఈ శ్రీనివాసన, ఎంటమాలజిస్టు వెంకటేశ్వర్లు ఉన్నారు.
ఫ ట్రేడ్ లైసెన్సు రుసుముల వసూళ్లను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. పారిశుధ్య తనిఖీ దారులు, కార్యదర్శులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్సు రుసుముల పెంపుదలను నిలిపివేయాలని గత నెల 6న మంత్రి టీజీ భరత ఆదేశించారని, అదుకు అనుగుణంగా కర్నూలు నగర పాలక సంస్థ ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం పరిపాలన అనుమతులు, సాంకేతిక సమస్యలను అధిగమించి పాత ధరలను యథావిధిగా వసూలు చేసేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింద న్నారు. ఈ నెల 31తేదీ వరకు గడువు ఉంటుందన్నారు. కాన్ఫ రెన్సులో ప్రజారోగ్య అధికారి డా.నాగప్రసాద్‌బాబు, శానిటరీ ఇన్సపెక్టర్లు ఉన్నారు.
ఫ నగరంలో రోడ్లు, డ్రైనేజీ కాలువలు వంటి మౌలిక సదుపాయాల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండ పాటించాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శనివారం ఆయన చెక్‌పోస్టు సమీపంలోని నందికొ ట్కూరు రహదారి నుంచి నంద్యాల రహదారికి అనుసంధాన బి.టి.రహదా రిని పరిశీలించారు. రూ.2కోట్లతో నిర్మించిన రహదారిలో తుది దశ పనులు సక్రమంగా చేయక పోవడంతో ఆసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు బిల్లులు అధికారులు ముందుకు పంపకుండ తమ వద్దే రెండు నెలలుగా పెండింగ్‌లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌కవేటర్‌కు లాగ్ బుక్ నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఈఈ నరేష్, ఏఈ జనార్ధన ఉన్నారు.