Share News

ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ABN , Publish Date - Apr 20 , 2026 | 11:55 PM

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రీ-ఓపెన్‌ అయిన ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రీ-ఓపెన్‌ అయిన ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సరైన ఎండార్స్‌మెంట్‌ ఇవ్వకపోతే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి సమగ్రంగా నివేదికలు సమర్పించాలన్నారు. జిల్లాలో మొత్తం 5,283 దరఖాస్తులు రీ ఓపెన్‌ చేయబడగా వాటిలో 4,919 దరఖాస్తులు పరిష్కారమయ్యాయన్నారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌ ద్వారా 230 అర్జీలు, రెవెన్యూ క్లినిక్స్‌ ద్వారా 162 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. అదేవిధంగా స్వీయ గణనను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్‌లో బసవజయంతి : కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో సోమవారం బసవ జయంతి వేడుకలు జరిగాయి. బసవే శ్వరుడి చిత్రపటానికి కలెక్టర్‌ రాజకుమారి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రామునాయక్‌, జిల్లా టూరిజం అధికారి విజయలక్ష్మి, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 11:55 PM