Share News

రోగులతో మర్యాదగా మాట్లాడండి

ABN , Publish Date - May 01 , 2026 | 11:00 PM

ఆసుపత్రికి వచ్చే రోగులతో, వారి సహాయకులతో వైద్యులు మర్యాదతో మాట్లాడాలని, అప్పుడే ఆస్పత్రి అందించే సేవలపై వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ పెరుగుతుందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

రోగులతో మర్యాదగా మాట్లాడండి
వైద్యులతో మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌

అప్పుడే ఆస్పత్రి సేవలపై వారి అభిప్రాయాలు తెలుస్తాయి

వైద్యులతో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

కర్నూలు హాస్పిటల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వచ్చే రోగులతో, వారి సహాయకులతో వైద్యులు మర్యాదతో మాట్లాడాలని, అప్పుడే ఆస్పత్రి అందించే సేవలపై వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ పెరుగుతుందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ పలు విభాగాల్లో అకస్మిక తనిఖీ నిర్వహించారు. రోగులు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయిన వారి నుంచి ప్రభుత్వం ఫీడ్‌ బ్యాక్‌ కాల్‌ వస్తుందని, ఆ కాల్‌కు ఖచ్చితంగా స్పందించి ఆసుపత్రి సేవలపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని రోగులు, వారి సహాయకులకు వివరించాలని వైద్యులకు సూచించారు. ఈ విషయంలో ఆసుపత్రి బాగా వెనుకబడిందన్నారు. అందు కే వివిధ విభాగాల హెచ్‌వోడీలు తప్పనిసరిగా చికిత్సపై రోగులకు కౌన్సిలిం గ్‌ నిర్వహించాలన్నారు. రోగులకు సంబంధించిన మందులు అన్ని అందు బాటులో ఉన్నాయని, బయటకు రాస్తే చర్యలు తప్పవని గుర్తు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా. లక్ష్మీబాయి, ఆర్‌ఎంవో డా. వెంకటరమణ, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేషన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. శివబాల, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ డా. ఎస్‌పీ సావిత్రీబాయి పాల్గొన్నారు

Updated Date - May 01 , 2026 | 11:00 PM