త్వరలో పేదలకు ఇళ్ల పట్టాలు
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:08 AM
: పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జేసీ కార్తీక్, ఆర్‌డీవో నరేంద్రనాథ్ రెడ్డితో కలిసి ఎస్సార్బీసీ కాలనీలోని స్థలాన్ని పరిశీలించారు.
మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
బనగానపల్లె, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జేసీ కార్తీక్, ఆర్‌డీవో నరేంద్రనాథ్ రెడ్డితో కలిసి ఎస్సార్బీసీ కాలనీలోని స్థలాన్ని పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు స్థలాలు ఇచ్చేందుకు ఎస్సార్బీసీ కాలనీ ప్రాంతాన్ని పరిశీలించామన్నారు. చంద్రబాబు బనగానపల్లెకు వచ్చిన సందర్భంలో పేదలకు ఇంటి పట్టాలు ఇస్తామని హమీ ఇచ్చారన్నారు. భూ బదలాయింపు ప్రక్రియ పూర్తయ్యాక అభివృద్ది చేస్తామన్నారు. పట్టణంలో 3500ల మందితో జాబితాను అధికారులు సిద్దం చేశారని, గతంలో జుర్రేరు వాగులో అక్రమంగా నిర్మించిన కార్పెంటర్ కాలనీ కోసం ప్రత్యామ్నాయంగా స్థలాలను పరిశీలిస్తున్నామన్నారు. వాగును బలోపేతం చేయడంతో పాటు వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చట్టాన్ని అతిక్రమించి రాజకీయ లబ్ది కోసం అక్రమంగా స్థలాలను ఇవ్వడం దారుణమన్నారు. జేసీ కార్తీక్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని తెలిపారు.