సమస్యలను వేగంగా పరిష్కరించండి
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:21 AM
అధికారులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ప్రజల నుంచి వినతుల స్వీకరణ
బనగానపల్లె, జూలై (ఆంధ్రజ్యోతి): అధికారులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీరించారు. అర్జీలను స్వయంగా చదివి సంబంఽధిత అధికారులకు ఫోన్‌చేసి పరిష్కరించారు. రెవెన్యూ సమస్యలకు సంబంధించిన అర్జీలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పంపాపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ది కార్యక్రమాలను అధికారులు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు.