Share News

సమస్యలను పరిష్కరించండి

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:17 AM

ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్‌ధన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

సమస్యలను పరిష్కరించండి
అర్జీలను స్వీకరిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

కోవెలకుంట్ల, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్‌ధన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మండలంలోని నాయకులు కార్యకర్తలను గ్రామాల వారీగా పిలిపించుకొని సమస్యలు అడిగి తెలుసుకొని త్వరలోనే వాటిని పరిశీలిస్తామని హమీ ఇచ్చారు. గుళ్ళదుర్తి సుదర్శన్‌ రెడ్డి, వెలగటూరు ధనుంజయుడు, బిజినవేముల హుస్సేనయ్య, వల్లంపాడు జగదీష్‌ రెడ్డి, చిన్న కొప్పెర్ల బుచ్చెన్న, కంపమల్ల సుబ్బారెడ్డి, అమడాల మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.

షాదీఖానా భవనాన్ని పరిశీలించిన మంత్రి బీసీ

బనగానపల్లె: పట్టణంలో రూ.2.6కోట్లతో నిర్మిస్తున్న షాదీఖానా భవనాన్ని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి గురువారం పరిశీలించారు.ప్రభుత్వ నిధులు రూ.కోటి, మంత్రి సొంత నిధులు రూ. 1కోటి 6కోట్లు, మొత్తం రూ.2.6కోట్లతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని ఈనెల 20న ప్రారంభించనున్నారు. మంత్రి పరిశీలించి, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సొసైటీ చైర్మన్‌ అబ్దుల్‌కలాం పాల్గొన్నారు.

నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

నిమజ్జనాన్ని భక్తులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మంత్రి బీసీ కోరారు. కైప చెర్వు వద్ద గురువారం గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. బనగానపల్లె, తమ్మడపల్లె, యాగంటిపల్లె, బత్తులూరుపాడు గ్రామాల విగ్రహాలను శుక్రవారం నిమజ్జనం చేస్తారన్నారు. విద్యుత్‌ బల్బులు ఏర్పాటుచేసి విద్యుత్‌ కోతలు లేకుండా చూసుకోవాలని ఏఈ గర్జప్పను, ు.శానిటేషన్‌ను సక్రమంగా నిర్వహించి ఘాట్‌ వద్ద పరిశుభ్రత ఉండేలా చూడాలని గ్రామ పంచాయితీ ఈవో మురళీమోహన్‌ను ఆదేశించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలని సీఐ ప్రవీణ్‌కుమార్‌ను కోరారు. తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, రఘునాథరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, గణేశ్‌ నిమజ్జన కమిటీ గౌరవాధ్యక్షులు టంగుటూరు శ్రీనయ్య, అధ్యక్షుడు మల్లారెడ్డి, కోడినాగేశ్‌, గుండా రవికుమార్‌, వంకదారి వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 12:17 AM