Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:18 AM

నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, వినతులు స్వీకరించారు. ప్రజలు నీటి సరఫరా, రోడ్లు, ఫించన్లు, విద్యుత్‌, ఆరోగ్య సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

బేతంచెర్ల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, వినతులు స్వీకరించారు. ప్రజలు నీటి సరఫరా, రోడ్లు, ఫించన్లు, విద్యుత్‌, ఆరోగ్య సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. అర్జీలను పరిశీలించి, అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు.

పట్టణాన్ని పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దన్నుట్లు ఎమ్మెల్యే అన్నారు. శనివారం బేతంచెర్ల నగర పంచాయితీ ఆధ్వర్యంలో మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ ప్లాంట్‌ను కలెక్టర్‌ రాజకుమారితో, సీఎం చంద్రబాబు ప్లాంట్‌ను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వం పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తోందని, చెత్తను శాస్త్రీయంగా సేకరించి, వర్గీకరించడం, పునఃవినియోగం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నామన్నారు.

అనంతరం కొలుములపల్లె రోడ్డులో ఉన్న పైప్‌లైన్‌ పనులను ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం మంజూరు చేసిన స్టవ్‌లను సీడీపీవో శంషాద్‌ బేగంతో కలిసి పంపిణీ చేశారు. కమిషనర్‌ హరి ప్రసాద్‌, కన్వీనర్‌ ఎల్లనాగయ్య, బుగ్గన ప్రసన్న లక్ష్మి, డిఎస్పీ శ్రీనివాస్‌, సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ రమేష్‌ బాబు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:18 AM