Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:13 AM

ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ఆళ్లగడ్డలో వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే

ఆళ్లగడ్డ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వినతులు స్వీకరించారు. అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేశారు.

తాగునీటి సమస్య రాకుండా చర్యలు

ఉయ్యాలవాడ: నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మండల పరిషత్‌ కార్యాలయంలో నాయకులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. 20 గ్రామాలుండగా, 16 గ్రామాలు కుందూనది పరీవాహక ప్రాంతంలో ఉన్నాయన్నారు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నందన పది రోజులకు సరిపోతుందన్నారు. అవసరమైన చోట్ల బోర్లు వేసి, మోటార్లు ఏర్పాటు చేసేందుకు 2.83 కోట్లు అవసరమన్నారు. ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాతానని ఆమె తెలిపారు. కుందూతీర ప్రాంత రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలి ఎమ్మెల్యే సూచించారు. కుందూనదిలోని చెలిమెల్లోని నీటిని త్రాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలన్నారు. వర్షాలు కురిసేవరకు రైతులు నారుమడులు వేయవద్దన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ సుబ్రహ్మణ్యం, తహసీల్దారు ప్రసాద్‌బాబు, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, మండల టీడీపీ కన్వినర్‌ బోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నాయకులు మారంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కూడాల నారాయణరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, మహేశ్వరరెడ్డి, చిన్న వెంకటసుబ్బయ్య, క్రిష్ణారెడ్డి, నారాయణ, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 12:13 AM