ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:22 AM
ప్రజాసమస్యలను అధికారులు ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలను అధికారులు ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల, టీడీపీ నాయకుల, కార్యకర్తల అర్జీలను స్వయంగా స్వీకరించారు. పలువురు అధికారులకు మంత్రి స్వయంగా ఫోన్‌లు చేసి త్వరగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, ఇతర సమస్యలను అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పకుండా పరిష్కరించాలని సూచించారు. అర్జీలను పరిష్కరించడానికి కృషి చేసిన మంత్రిని ప్రజలు అభినందించారు.