Share News

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:37 AM

రెవెన్యూక్లినిక్‌లు, స్పెషల్‌క్యాంపుల ద్వారా వచ్చిన రైతుసమస్యల అర్జీలను త్వరితగగతిన పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ఖమర్‌ అన్నారు. బుధవారం పత్తికొండ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో భరత్‌నాయక్‌, డీఆర్‌వోవో నారాయణమ్మలతో కలిసి డివిజన్‌పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జేసీ నూరుల్‌ ఖమర్‌

జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

పత్తికొండ, జనవరి 7, (ఆంధ్రజ్యోతి): రెవెన్యూక్లినిక్‌లు, స్పెషల్‌క్యాంపుల ద్వారా వచ్చిన రైతుసమస్యల అర్జీలను త్వరితగగతిన పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ఖమర్‌ అన్నారు. బుధవారం పత్తికొండ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో భరత్‌నాయక్‌, డీఆర్‌వోవో నారాయణమ్మలతో కలిసి డివిజన్‌పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. రీసర్వేగ్రామాల్లో తుది డిఎల్‌ఆర్‌ ప్రక్రియను అత్యంతజాగ్రత్తగా నిర్వహించాలని, ఎటువంటి లోపాలకు తావివ్వకుండా తప్పిదాలు చోటుచేసుకోకుండా పూర్తిచేయాలన్నారు. భవిష్యత్‌లో రైతులు కాని, ప్రజలుకాని ఆసమస్యలపై రెవెన్యూ కార్యాలయానికి వచ్చేపరిస్థితి లేకుండా పారదర్శకంగా పనిచేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలతోపాటు అవతలివ్యక్తుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, గ్రామంలో విచారణ చేయాలని, ప్రతిదశను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. అలాగే చుక్కలభూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులకు ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇనాం, నిషేధిత జాబితా, రీసర్వే అంశాలకు సంబందించిన రికార్డులను ఆయన పరిశీలించారు. డివిజన్‌ పరిదిలోని తహసీల్దార్లు, రెవెన్యూసిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌..

పత్తికొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని భూసమస్యల పరిష్కారంపై బుధఽవారం కలెక్టర్‌ సిరి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడారు. రెవెన్యూక్లినిక్‌, స్పెషల్‌క్యాంపుల ద్వారా వచ్చిన అర్జీలను త్వరగతిన పూర్తిచేయాలని సూచించారు.

Updated Date - Jan 08 , 2026 | 12:37 AM