ప్రజా సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - May 19 , 2026 | 11:23 PM
ఆళ్లగడ్డలో ఇటీవల నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లి, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డలో ఇటీవల నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్సరెన్స్ ద్వారా ఫిర్యాదుల పరిష్కార ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం 31 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 578 పిర్యాధులు అందగా వాటి పరిష్కారానికి 93 మంది అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు కేవలం 34 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం కావడంపై అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన వాటిని కూడా వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమస్యకు శాస్వత పరిష్కారం చూపిన తర్వాతే దరఖాస్తులను క్లోజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల పరిధిలోని పెండింగ్ సమస్యలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంకాలం ఆర్డీఓలు సమీక్షలు నిర్వహిస్తూ శాఖల పనితీరును పర్యవేక్షించాలన్నారు.