ప్రజా సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - May 18 , 2026 | 11:29 PM
సమస్యల పరిష్కారం కో సం వచ్చే ఫిర్యాదిదారులతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చరాదని, చట్ట పరిధిలో వారి సమస్యలకు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు.
ఎస్పీ సునీల్ షెరాన్
పీజీఆర్‌ఎస్‌కు 114 ఫిర్యాదులు
నంద్యాల క్రైమ్, మే 18 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కో సం వచ్చే ఫిర్యాదిదారులతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చరాదని, చట్ట పరిధిలో వారి సమస్యలకు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహిం చిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వివిధ సమ స్యలపై వచ్చిన 114 ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదిదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనం తరం ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు. ఫిర్యాదులు పునరా వృతం కాకుండా నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపించాలని అధికారు లను ఆదేశించారు.