సమన్వయంతో సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:17 PM
అధికారులు సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఆదేశించారు.
న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): అధికారులు సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఆదేశించారు. శుక్ర వారం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల నియోజకవర్గానికి చెందిన ప్రజల నుంచి స్వయంగా ఆయన దరఖాస్తులను స్వీకరించారు. సంబంధిత అధికా రులతో ఫోన్‌లో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్క రించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్‌కు వచ్చే సమస్యలను వేగంగా పరిష్కరించాలని అన్నారు.