చుక్కల భూముల సమస్యలకు పరిష్కారం: కలెక్టర్
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:55 PM
జిల్లాలో 22ఏ, చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ ఎ.సిరి తెలి పారు.
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 22ఏ, చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ ఎ.సిరి తెలి పారు. నగరంలోని కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం 22ఏ, చుక్కల భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి కర్నూలు రూరల్, వెల్దుర్తి, తుగ్గలి మండలాలకు చెందిన పది మంది రైతులకు కలెక్టర్ ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. కర్నూలు రూరల్ మం డలం రుద్రవరం గ్రామానికి చెందిన జె.రామాంజనేయులు, శేషిరెడ్డి, గార్గేయపురం గ్రామ నివాసి నల్లగొట్ల లక్ష్మన్న, వెల్దుర్తి మండలం నర్సా పురం గ్రామానికి చెందిన దేశపోగు లక్ష్మమ్మ, దేశపోగు ఆంజనే యులు, తుగ్గలి మండలానికి చెందిన ఉప్పరి సుబ్బరాయుడు, చంద్రశే ఖర్‌కు చెందిన 22ఏ, చుక్కల భూముల సమస్యలను పరిష్కరించినట్లు తెలి పారు. ఈ ఏడాది 22ఏ భూములకు సంబంధించి 242 సమస్యల ను, 32వేల ఇనాం నుంచి పట్టా సమస్యలను పరిష్కరించామని తెలిపారు.