Share News

ఘన వ్యర్థాలను పరిశ్రమలకు అందించాలి

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:09 AM

జిల్లాలోని నగర, పురపాలక సంఘాల పరిధిలో లభ్యమయ్యే ఘన వ్యర్థాలను సంబంధిత సిమెంటు పరిశ్రమలకు అందజేయాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన చైర్మన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ సూచించారు.

ఘన వ్యర్థాలను పరిశ్రమలకు అందించాలి
మాట్లాడుతున్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన చైర్మన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నగర, పురపాలక సంఘాల పరిధిలో లభ్యమయ్యే ఘన వ్యర్థాలను సంబంధిత సిమెంటు పరిశ్రమలకు అందజేయాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన చైర్మన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ సూచించారు. మంగళవారం కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాల యంలో రాయలసీమలోని సిమెంటు పరిశ్రమల ప్రతినిధులతో సమీక్షించారు. మ్యాప్‌ చేసిన స్థానిక సంస్థల నుంచి తగిన కెలోరిఫిక్‌ విలువ కలిగిన ఘన వ్యర్థాలను పరిశ్రమలు సైతం తప్పనిసరిగా వినియోగించాలన్నారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఘన వ్యర్థాలను వినియోగించటం ద్వారా కలిగే ఆర్థిక ఇతరత్రా ప్రయోజనాలపై సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని, వాటిని పాటించని పరిశ్రమల నుంచి పర్యావ రణ పరిహారాన్ని వసూలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఏపీపీ సీబీ చైర్మన డాక్టర్‌ పి.కృష్ణయ్య, జెఎస్‌డబ్ల్యూ హెడ్‌ నాగరాజు హెగ్డే, నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:09 AM