ఓర్వకల్లుకు సౌర కళ
ABN , Publish Date - Aug 15 , 2026 | 11:30 PM
అగస్త్య సౌర పరిశ్రమ ఏర్పాటుతో ఓర్వకల్లు ప్రాంతానికి కొత్త కళ సంతరించుకుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
రూ.7800 కోట్లతో అగస్త్య సోలార్ పరిశ్రమకు భూమి పూజ
ఓర్వకల్లు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): అగస్త్య సౌర పరిశ్రమ ఏర్పాటుతో ఓర్వకల్లు ప్రాంతానికి కొత్త కళ సంతరించుకుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. ఓర్వకల్లు ప్రాంతంలోని గుట్టపాడు, మీదివేముల పొలిమేరలో ఏర్పాటు చేస్తున్న అగస్త్య ఎనర్జీ ఇండస్ర్టీస్ సోలార్ మ్యానిఫ్యాక్చరింగ్ పరిశ్రమ భూమి పూజకు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి, యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులకు అగస్త్య పరిశ్రమల చైర్మన్ అనుభవ్ అగర్వాల్ గ్రూప్ చైర్మన అజయ్ కుమార్ అగర్వాల్, మేనేజింగ్ డైరెక్టర్ పీయూస్ బిటోరియా ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఓర్వకల్లు మండలంలో రూ.7,800 కోట్లతో తొలిదశలో 120 ఎకరాల్లో, రెండో దశలో మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో అగస్త్య పరిశ్రమ అభివృద్ధి చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, ఏసేపు పాల్గొన్నారు.