ఆదోని జిల్లా కోసం విచిత్ర వేషధారణలో సామాజిక కార్యకర్త
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:40 AM
ఆదోనిని జిల్లా చేయాలంటూ సామాజిక కార్యకర్త కమలాకర్‌నాయుడుతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
ఆలూరు, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ఆదోనిని జిల్లా చేయాలంటూ సామాజిక కార్యకర్త కమలాకర్‌నాయుడుతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆది మానవుడి వేషధారణలో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండులో నిర్వహిస్తున్న 21వ రోజు రిలే దీక్షలో ఆయన కూర్చున్నారు. వీరికి మద్దతుగా ఆలూరు జేఏసీ నాయకులు కత్తి రామాంజనేయులు, భూపేశ, ఎల్లప్ప, దాదాబాషా, పూల రామాంజనేయులు, హనుమంతు కూర్చుకున్నారు. ఆలూరు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలన్నారు. ఇందుకోసం 5 నియోజకవర్గ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల ఆకాంక్షను వినిపించాలన్నారు. లేదంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలకు ఆదోని జేఏసీ నాయ కులు వీరేష్, ఆలూరు సీపీఐ నాయకులు రామాంజనేయులు, బుడగ జంగాల సంఘం నాయకులు సిరివాటి మహేంద్ర, ఏపీయూడబ్ల్యూజే నాయకులు స్వరూప్, చంద్రబాబు, డానియల్, అధ్యాపకులు బాలకృష్ణ సంఘీభావం ప్రకటించారు.