Share News

ఎస్సీలకు సామాజిక న్యాయం చేస్తాం

ABN , Publish Date - May 20 , 2026 | 12:09 AM

ఎస్సీలకు సామాజిక న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని చిగురుమానుపేట కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై చేసిన దౌర్జన్యాలు, వివక్షను ఖండించారు.

ఎస్సీలకు సామాజిక న్యాయం చేస్తాం
చిగురుమానుపేట కాలనీలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

డోన్‌ టౌన్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): ఎస్సీలకు సామాజిక న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని చిగురుమానుపేట కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై చేసిన దౌర్జన్యాలు, వివక్షను ఖండించారు. రాజ్యాంగ నిర్మాత అబేడ్కర్‌ కలలు కన్న సమానత్వసమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సామాజిక న్యాయం మాటల్లో కాకుండా రక్షణ, విద్య, ఉపాది ఆర్థిక స్వాలంబన కావాలన్నారు. లక్కసాగరం లక్ష్మీరెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్‌ పెద్ద కేశవయ్య గౌడు, టీడీపీ పట్టణ ఽఅధ్యక్షులు టీఈ రాఘవేంద్రగౌడు, మాజీ ఎంపీపీ శేషఫణి గౌడు, భూమా నాగన్న, చనుగొండ్ల శ్రీరాములు, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2026 | 12:09 AM