మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:18 AM
మహిళల సాధికా రితతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి
నంద్యాల రూరల్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : మహిళల సాధికా రితతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని టౌన్ హాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి పెరగాని అన్నారు. గ్రామీణ మహిళల చదువును ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు సామాజికంగా ఆర్ధికంగా, రాజకీయంగా ఎదిగినపుడే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కును ఎన్టీఆర్ కల్పించారని అన్నారు. మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ లీలావతి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, డీఆర్డీఏ శ్రీధర్‌రెడ్డి, మెప్మా పీడీ వెంకటదాస్, అధికారులు పాల్గొన్నారు.