పుస్తక పఠనంతో సామాజిక వికాసం
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:14 AM
పుస్తక పఠనంతో సామాజిక వికాసం పెరుగుతుందని జిల్లా వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులడు కాపు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.
జిల్లా వయోజన విద్యాశాఖ డీడీ చంద్రశేఖర్‌రెడ్డి
కర్నూలు కల్చరల్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : పుస్తక పఠనంతో సామాజిక వికాసం పెరుగుతుందని జిల్లా వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులడు కాపు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కొనసాగుతున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నాలుగోరోజు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తొలుత గ్రంథాలయ ఉద్యమ పితామహులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి గ్రంథాలయాలు సేవలందిస్తున్నాయన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. ప్రకాశ మాట్లాడుతూ ఒక మంచి పుస్తకంలోని పరిజ్ఞానం ఎప్పుడో ఒకసారి తప్పకుండా అవసరం అవుతుందన్నారు. విద్యార్థులకు చిత్ర లేఖన పోటీలు నిర్వహించారు. పోటీలకు పరిశీలకునిగా విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రసాద్ వ్యవహరించారు. గ్రంథాలయ సం స్థ ఉప గ్రంథాలయ అధికారి వి. పెద్దక్క, లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి, ఎస్. బాషా, కార్యాలయ సహాయకుడు మక్బుల్ బాషా, ఉద్యోగులు పాల్గొన్నారు.