Share News

రసవత్తరంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:38 PM

కర్నూలు జిల్లాలో పాఠశాలల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఈఎన్నిక కొన్నిచోట్ల సాధారణ ఎన్నికలను తలపించాయి.

రసవత్తరంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు
కర్నూలు ఎస్‌ఏపీ క్యాంపు సీఆర్‌ఆర్‌ మున్సిపల్‌ హై స్కూల్‌లో నూతన సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న కన్వీనర్‌, హెచ్‌ఎం వెంకటరెడ్డి

జిల్లాలో మొత్తం ఎస్‌ఎంసీలు 1442

ఎన్నికలు పూర్తయినవి 1391

కోరం లేక నిలిచిపోయినవి 51

కర్నూలు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో పాఠశాలల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఈఎన్నిక కొన్నిచోట్ల సాధారణ ఎన్నికలను తలపించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ వర్గీయుల మధ్య పోటా పోటీగా కొనసాగాయి. కల్లూరు, కోడుమూరు, గూడూరు, పత్తికొండ, తుగ్గలి, ఆస్పరి, గోనెగండ్ల, మద్దికెరలో హంప, కర్నూలు, ఎమ్మిగనూరు మండలాల్లో ఇరువర్గాల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో ఎన్నిక పోటీ ఉత్కంఠ భరితంగా మారి చివరికి కోరం లేక వాయిదా పడింది. జిల్లాలో పాఠశాలల నిర్వహణ కమిటీలు 1,442 ఉన్నా యి. 1,392కు ఎస్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. 14 మండలాల్లోని 51 ఎస్‌ఎంసీలకు కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరిగాయి. డీఈవో సుధాకర్‌, ఎస్‌ఎ్‌సఏ ఏపీసీ ఎన్‌జీ లోక్‌రాజ్‌, కల్లూరు, వెల్దుర్తి, కర్నూలు మండలాల్లోని పాఠశాలలో జరిగే ఎన్నికను పరిశీలించారు. కొన్నిచోట్ల చేతులెత్తే విధానంలో ఎన్నిక జరగ్గా.. మరి కొన్నిచోట్ల చేతులతో రాసే ఓటింగ్‌ (బ్యాలెట్‌) ఎన్నిక జరిగింది. నూతనంగా ఎన్నికైన చైర్మన్‌, వైస్‌ చైర్మన్లతో పాఠశాల హెచ్‌ఎంలు, కమిటీ కన్వీనర్‌ ప్రమాణాస్వీకారం చేయించారు. అనంతరం మొట్టమొదటి పాఠశాలల యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహించి తీర్మానాలు చేశారు. వాయిదా పడిన ఎన్నికలకు స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆదేశాల మేరకే తిరిగి వాటికి ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎ్‌సఏ ఏపీసీ లోక్‌రాజ్‌ తెలిపారు.

Updated Date - Sep 29 , 2026 | 11:38 PM