శ్రీశైల జలాశయానికి స్వల్పంగా ఇన్‌ఫ్లో
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:39 PM
ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వ ర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్‌కు స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది.
శ్రీశైలం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వ ర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్‌కు స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. గురువారం సుంకేసుల ప్రాజెక్టు నుంచి 6,759 క్యూసెక్కుల నీరు విడుదలై రిజర్వాయర్‌కు చేరుకు న్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 821.70 అడుగుల నీటి నిల్వ, 42.842 టీఎంసీల నీటి సామర్థ్యం నమోదైంది.