ఆకాశన్నంటిన ధరలు
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:27 PM
కర్నూలు మార్కెట్ యార్డులో రైతులు అమ్మకానికి తెచ్చిన పంట ఉత్పత్తుల ధరలు శుక్రవారం ఆకాశాన్నంటాయి.
సంతోషంలో అన్నదాతలు
కర్నూలు అగ్రికల్చర్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్ యార్డులో రైతులు అమ్మకానికి తెచ్చిన పంట ఉత్పత్తుల ధరలు శుక్రవారం ఆకాశాన్నంటాయి. రైతులు సంబరపడిపోతున్నారు. మార్కెట్ యార్డుకు ఏకంగా 1,407 క్వింటాళ్ల వేరుశనగ కా యలను రైతులు అమ్మకానికి తెచ్చారు. క్వింటానికి గరిష్ఠంగా రూ.10,200 రైతులకు దక్కాయని సెలక్షన్ గ్రేడ్‌సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. మధ్యస్థ ధర రూ.9,760లు, కనిష్ఠం రూ.4,002 అందింది. వాము 3,649 క్వింటాళ్లను క్వింటాళ్లను కర్ణాటకలోని పలు ప్రాంతాలను రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. క్వింటానికి గరిష్ఠ ధర రూ.28,180, మధ్యస్థం రూ.21,089, కనిష్ఠం రూ.2,511లు రైతులకు దక్కింది. వాము పొట్టుకు కూడా భారీ ధర లభించడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తంచేశారు. కందులు గరిష్ఠం రూ.7,704, మధ్యస్థం రూ.7,469, కనిష్ఠం రూ.2,728లు అందింది. శనగలు, ఉల్లిగడ్డలు, మిర్చికి కూడా భారీ ధరలు లభించాయి. రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులను తూకాలు వేసే సమ యంలో కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, కార్మికులు నిబంధనలకు లోబడి అమ్మకాలు జరపాలని జయలక్ష్మి స్పష్టం చేశారు.