న్యాయాధికారులకు నైపుణ్య శిక్షణ
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:34 PM
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని న్యాయాధికారులకు శనివారం ఒకరోజు నైపుణ్య శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కర్నూలు లీగల్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని న్యాయాధికారులకు శనివారం ఒకరోజు నైపుణ్య శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నగరంలోని జిల్లా కోర్టులో ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయాధికారి టి.లీలావతి ఈ శిక్షణను ప్రారంభించారు. విజయవాడ సీనియర్ సివిల్ న్యాయాధికారి పి.దివాకర్, బనగానపల్లె జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్.ప్రతిమా శిక్షణ ఇచ్చారు. కేసుల పరిష్కారంలో న్యాయాధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కేసుల సత్వర పరిష్కారానికి సముచిత నైపుణ్యాన్ని ఎలా వినియోగించుకోవాలో వివరించారు. కార్యక్రమంలో నంద్యాల 3వ అదనపు జిల్లా న్యాయాధికారి డి.అమ్మన్నరాజా, సీబీఐ కోర్టు న్యాయాధికారి ఎం .శోభారాణి, కర్నూలు 7వ అదనపు జిల్లా న్యాయాధికారి వి.రాజ్యలక్ష్మి, కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎన్.శ్రీవిద్య, కర్నూలు పోక్సో కోర్టు న్యాయాధికారి ఈ.రాజేంద్రబాబు, ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్, జూనియర సివిల్ న్యాయాధికారులు పాల్గొన్నారు.