డీఎంహెచ్వో కార్యాలయానికి స్థల పరిశీలన
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:06 AM
డీఎంహెచ్వో కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం కోసం స్థలాన్ని సేకరించాలని కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు.
కర్నూలు హాస్పిటల్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): డీఎంహెచ్వో కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం కోసం స్థలాన్ని సేకరించాలని కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం డీఎంహెచ్వో డా.వై.కామేశ్వరప్రసాద్, ఏపీఎంఎ్సఐడీసీ ఎస్ఈ ఇందిర, ఈఈ నరేంద్రర రెడ్డి భవనానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించారు. మొదట జిల్లా ఇమ్యూనైజేషన్ కార్యాలయం పైఅంతస్థును డీఎంహెచ్వో, ఇంజనీర్లు పరిశీలించారు. ప్రభుత్వ ఆయుర్వేద హోమియో వైద్యశాల పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా చూశారు. కొత్త భవనంకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏపీ ఎంఎ్సఐడీసీ ఎస్ఈ ఇందిరను డీఎంహెచ్వో సూచించారు. ప్రతిపాదనల అనంతరం కొత్త భవనం ఏర్పాటుకు ప్రభుత్వానికి కలెక్టర్కు నివేదికను పంపనున్నట్లు డీఎంహెచ్వో తెలిపారు. జిల్లా సంచార చికిత్స కార్యక్రమ అధికారి డా.విశ్వేశ్వరరెడ్డి, ఏపిడమాలజిస్టు వేణుగోపాల్, ఎస్వో హేమసుందర్, ఏపీఎంఎ్సఐడీసీ డీఈ జయరాముడు పాల్గొన్నారు.