సర్‌సమాప్తం
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:25 PM
ఎట్టకేలకు సర్ గడువు లోపు జిల్లా అధికార యంత్రాగం జిల్లా వ్యాప్తంగా ఓటర్ల సంఖ్యను పక్కాగా తేల్చారు.
87.26 శాతం డిజిటలైజేషన్
అన్‌కలెక్టబుల్‌గా 1,79,083 మంది గుర్తింపు
మృతులు, డబుల్ ఎంట్రీలుగా 87,831 మంది
అక్టోబరు 3న తుది జాబితా విడుదల
నంద్యాల, జూలై24(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు సర్ గడువు లోపు జిల్లా అధికార యంత్రాగం జిల్లా వ్యాప్తంగా ఓటర్ల సంఖ్యను పక్కాగా తేల్చారు. అధికారులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠకు తెరపడి నట్లైంది. జిల్లావ్యాప్తంగా 14,05,443మంది ఓటర్లు ఉండగా 12,26,360 మందికి డిజటలైజేషన్ చేయడంతో 87.26శాతం నమోదైంది. అన్ కలెక్టబుల్ కింద 1,79,083మంది ఓటర్లను గుర్తించారు. వీరిలో ఏకంగా 87,831మంది డబుల్ ఎంట్రీలు, మృతుల ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరందరిని పక్కాగా తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో మిగిలిన 91,252మంది ఓటర్లతో పాటు మృతులు, డబుల్ ఎం ట్రీల ఓటర్లకు కూడా త్వరలో నోటీసులు జారీ చేసి మరోమారు పక్కా ఓటర్ల జాబితాను గుర్తించి అక్టోబరు 3వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు.
ఈ లెక్కన జిల్లాలోని నంద్యాల, డోన్ నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఓటర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక నుంచి నోటీసులు జారీ
సర్ గడువు ముగిసింది. అన్‌కలెక్టబుల్ కింద ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం నోటీసులు జారీచేసి అర్హులతో కూడిన జాబితాను సిద్ధం చేస్తాం. ఎక్కడైన ఓటర్ల అభ్యంతరాలుంటే సంబంధిత ఈఆర్‌వోకు ఫిర్యాదు చేయాలి. అక్టోబరు 3న తుది జాబితా ప్రకటిస్తాం. గడువు లోపు వందశాతం పూర్తిచేయడంలో కృషి చేసిన ప్రతిఒక్కరికి అభినందనలు.
రాజకుమారి, కలెక్టర్, నంద్యాల
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
సర్ ప్రక్రియలో భాగంగా అన్ కలెక్టబుల్ కింద నియోజకవర్గాల వారీగా పరిశీలిద్దాం.
నియోజకవర్గం అన్‌కలెక్టబుల్ మృతులు డబుల్
ఓటర్లు ఎంట్రీలు
ఆళ్లగడ్డ 23,670 10,109 4,522
శ్రీశైలం 25,413 7,115 6,727
నందికొట్కూరు 23,191 9,053 4,337
నంద్యాల 52,138 10,484 8,307
బనగానపల్లె 25,689 8,095 4,541
డోన్ 28,982 7,398 7,143