సర్ సక్సెస్..!
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:34 PM
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశారు.
99.87 శాతం డిజిటలైజేషన్ పూర్తి
జిల్లాలో చనిపోయన ఓటర్లు 63 వేలు
డబుల్ ఎంట్రీలు 55 వేలు
శాశ్వతంగా వలస వెళ్లిన వారు 69 వేలు
గుర్తించని ఓటర్లు 77 వేల మంది
మార్పు చేర్పులకు మరో అవకాశం
24 వరకు గడువు పెంపు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశారు. మంగళవారంతో ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన వినతులు పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం మరో పది రోజులు పొడిగించింది. ఈ నెల 24 వరకు అవకాశం కల్పించింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో, ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలను పరుగులు పెట్టించడంతో సర్ విజయవంతమైంది. మంగళవారం సాయంత్రం 20,83,307 మంది ఓటర్లను ఆన్‌లైన్‌లో డిజిటలైజ్ చేశారు. 99.87 శాతం పురోగతి సాధించారు. మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, డబుల్ ఎంట్రీలు, అడ్రస్ దొరకని (నాట్ ట్రేసౌట్) ఓటర్లు 2.60 లక్షల మందిని గుర్తించారు.
కర్నూలు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)’ ప్రక్రియ ప్రారంభించే నాటికి జిల్లాలో 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. గత నెల 12వ తేదీ నుంచి సర్ ప్రక్రియ ప్రారంభమైంది. బీఎల్‌వోలు, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్‌ఏ సహకారంతో ఎన్యుమరేషన్ ఫారాలు వంద శాతం ఓటర్ల చూపించిన ఆడ్రస్‌లకు పంపిణీ చేశారు. అందులో 99.87 శాతం ఓటర్లను డిజిటలైజేషన్ పూర్తి చేశారు. కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌లు శని, ఆదివారాల్లో కూడా ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌వోలపై ఒత్తిడి తెచ్చి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆ ప్రక్రియను విజయవంతం చేశారు.
మరణించిన ఓటర్లు 63 వేలు.. డబుల్ ఎంట్రీలు 69 వేలు
జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న అడ్రస్‌ను గుర్తించి వంత శాతం 20,85,943 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. 20,83,307 ఓటర్ల ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. జిల్లాలో మరణించిన ఓటర్లు 63 వేల మందిని గుర్తించారు. అదే క్రమంలో ఒక వ్యక్తికి రెండు అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగిన డబుల్ ఎంట్రీలు 55 వేలు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు 69 వేలు, గుర్తించని ఓటర్లు 77 వేల మందిని గుర్తించారు. అంటే.. జిల్లాలో 2.60 లక్షల మంది ఓటర్లు జాబితా నుంచి తొలిగించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను ఈ నెల 24 వరకు పొడిగించింది. వాస్తవంగా 99.87 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. అడ్రస్‌లు గుర్తించని వారు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు ముందుకు వస్తే మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.
సోమవారానికి నియోజకవర్గాల
వారిగా ఓటర్లు, డిజిటలైజేషన్ వివరాలు:
నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్ శాతం
137-కర్నూలు 2,74,622 2,74,504 99.96
138-పాణ్యం 3,35,015 3,32,861 99.36
142-పత్తికొండ 2,26,970 2,26,970 100
143-కోడుమూరు 2,51,496 2,51,496 100
144-ఎమ్మిగనూరు 2,53,206 2,53,206 100
145-మంత్రాలయం 2,12,841 2,12,387 99.79
146-ఆదోని 2,67,980 2,67,897 99.97
147-ఆలూరు 2,63,989 2,63,986 100
మొత్తం 20,86,119 20,83,307 99.87