Share News

‘సర్‌’ని జయప్రదం చేయాలి

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:52 PM

ఓటరు జాబితా పారదర్శకంగా పెంపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ‘సర్‌’ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన)ను జయప్రదం చేయాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కోరారు.

‘సర్‌’ని జయప్రదం చేయాలి
సర్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దస్తగిరి

కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు రూరల్‌, జూన 10(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా పారదర్శకంగా పెంపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ‘సర్‌’ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన)ను జయప్రదం చేయాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కోరారు. కర్నూలులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటరు ధ్రువీకరణ ప్రక్రియలో బూత లెవల్‌ అధికారులతో టీడీపీకి చెందిన బూత లెవల్‌ ఏజెంట్లు సమస్వ యం చేసుకొని పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. మైటీడీపీ యాప్‌లో ఓటరు సమాచార నమోదును ఏవిధంగా చేయాలనే అంశంపై చర్చించారు. గతంలో 2002లో నిర్వ హించిన ‘సర్‌‘ని మళ్లీ ఇపుడు నిర్వహిస్తోందన్నారు. తద్వారా ఓటరు జాబితాలో మరింత ఖచ్చితత్వం పారదర్శకంగా వస్తుందన్నారు. ఈనెల 14 నుంచి ఇంటింటి ఓటరు ధ్రువీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి అర్హులైన ప్రతి ఓటరు వివరాలను నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు, కార్పొరేషన చైర్మన్లు, టీడీపీ నాయ కులు, కమిటీ సభ్యులు, క్లస్టర్‌ ఇనచార్జిలు, మండల కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:52 PM