Share News

‘సర్‌’ను సరిగా అమలు చేయాలి

ABN , Publish Date - Jun 30 , 2026 | 11:44 PM

ఓటర జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో సక్రమంగా, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

‘సర్‌’ను సరిగా అమలు చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ డా సిరి

కలెక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఓటర జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో సక్రమంగా, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మంగ ళవారం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ అంశంపై కలెక్టర్‌ ఈఆర్వో, ఏఈ ఆర్వోలతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మండలాల వారిగా పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు, (బీఎల్వోలు) క్షేత్ర స్థాయిలో సమర్ధవంతంగా పని చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణ, చట్టబద్ధమైన బాధ్యత అని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఎన్నికల విధులను నిర్వర్తించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. రోజుకు 6 నుంచి 7 గంటలు క్షేత్ర స్థాయిలో పని చేస్తే నిర్దేశిత లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు. రోజుకు కనీసం 10 శాతం చొప్పున పనిని పూర్తి చేయాలని అన్నారు. 1987కు ముందు జన్మించిన వారు తమ గుర్తింపు పత్రం సమర్పిస్తే సరిపోతుందని, 1987 నుంచి 2004 మధ్య జన్మించిన వారు తమ గుర్తింపు పత్రంతో పాటు తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరి గుర్తింపు పత్రాన్ని సమర్పించాలన్నారు. 2004 తర్వాత జన్మించిన వారు తమ గుర్తింపు పత్రంతో పాటు తల్లిదండ్రులిద్దరి గుర్తింపు పత్రాలు, తాజా ఫొటో, పూర్తిగా నింపిన ఎన్యుమరేషన్‌ ఫారం సమర్పించాలన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 11:44 PM