ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:49 PM
తమ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నదని, అందువల్లే ప్రజాదర్బార్‌కు విశేష స్పందన వస్తున్నదని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నదని, అందువల్లే ప్రజాదర్బార్‌కు విశేష స్పందన వస్తున్నదని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.