పారిశుధ్య నిర్వహణలో గణనీయమైన పురోగతి
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:13 PM
మంత్రి టీజీ భరత్ చొరవతో కర్నూలు నగరంలో పారిశుధ్య నిర్వహణలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని రాష్ట్ర స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.
రాష్ట్ర స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్
చెత్త పన్నును రద్దు చేసిన సీఎం చంద్రబాబు
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
ప్రజల భాగస్వామ్యంతోనే ‘స్వచ్ఛ కర్నూలు’ : కలెక్టర్ ఏ.సిరి
30 ఈ-ఆటోలు ప్రారంభం
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): మంత్రి టీజీ భరత్ చొరవతో కర్నూలు నగరంలో పారిశుధ్య నిర్వహణలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని రాష్ట్ర స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. బుధవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, కలెక్టర్, నగరపాలక ప్రత్యేకాధికారి ఏ.సిరితో కలిసి కొండారెడ్డి బురుజు వద్ద రాష్ట్ర ప్రభుత్వం నగర పాలక సంస్థకు మంజూరు చేసిన 30 ఈ-ఆటోలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణం జరుగుతుండగా, కర్నూలులో వేస్ట్ టు ఎన ర్జీ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రి టీజీ భరత్ చొరవ ఎంతో ఉందన్నా రు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో చెత్తపై పన్ను విధించడంతో పాటు, చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెత్తపై పన్ను రద్దు చేశారన్నారు. ఇంధనంతో నడిచే వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా పర్యావరణ రహితంగా చెత్త సేకరణకు శ్రీకారం చుట్టామన్నారు. నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంగా పనిచేస్తున్నారన్నారు. కమిషనర్ చల్లా ఓబులేసు నేతృత్వంలోని యంత్రాంగం సమర్దవంతంగా పనిచేస్తోందని అభినందించారు. కలెక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ కర్నూలు లక్ష్యాన్ని సాధించగలమని, ఇందుకోసం నగర పాలక సంస్థ అదికారులు, సిబ్బంది సమన్వయంతో నిరంతరం పని చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.పర్వీన్ బాను, ఎస్‌ఈ జే.రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి ఎం.రఘు, నగరపాలక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.