శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:06 AM
శ్రీశైల క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు గురువారం వైభవంగా పారంభమయ్యాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజా క్రతువులు చేసిన వేద పండితులు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగంట రమేష్ నాయుడుతో శివ చతుస్సప్తాహ అఖండ భజనలు శాస్త్రోక్తంగా ఆరంభిం చారు.
శ్రీశైలం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు గురువారం వైభవంగా పారంభమయ్యాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజా క్రతువులు చేసిన వేద పండితులు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగంట రమేష్ నాయుడుతో శివ చతుస్సప్తాహ అఖండ భజనలు శాస్త్రోక్తంగా ఆరంభిం చారు. ఆలయ ప్రాంగణంలోని వీర శిరో మండపంలో మాసాంతం రే యింబవళ్లు జరిగే భజనలను కర్నూలుకు చెందిన ఐదు భజన బృందాలతోపాటు కర్ణాటకకు చెందిన రెండు భజన బృందాలతో శివనా మస్మరణ అఖండ భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.