Share News

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:16 AM

చట్టాలపై అంగన్‌వాడీలు అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు ఐసీడీఎస్‌ కార్యాలయంలో అంగన్‌వాడీల కోసం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ పిల్లలపై లైంగిక వేధింపుల రక్షణ చట్టాన్ని, సైబర్‌ భద్రత, డ్రగ్స్‌ దుర్వినియోగం తదితర చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
మాట్లాడుతున్న లీలా వెంకటశేషాద్రి

ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి

ఆత్మకూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): చట్టాలపై అంగన్‌వాడీలు అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు ఐసీడీఎస్‌ కార్యాలయంలో అంగన్‌వాడీల కోసం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ పిల్లలపై లైంగిక వేధింపుల రక్షణ చట్టాన్ని, సైబర్‌ భద్రత, డ్రగ్స్‌ దుర్వినియోగం తదితర చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ విషయాల్లో ౖ టోల్‌ ఫ్రీ నెం:15100 ద్వారా న్యాయ సలహాలను పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి రాహుల్‌ అంబేద్కర్‌, సీడీపీవో కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

అదనపు కోర్టు భవనం పరిశీలన

ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు కానున్న అదనపు కోర్టు భవనాన్ని శుక్రవారం ఆరో అదనపు జిల్లా న్యాయాధికారి పి. వాసు, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి పరిశీలించారు. సుమారు ఆరు నెలల క్రితం ఆత్మకూరుకు అదనపు కోర్టు మంజూరు కాగా అందుకు అనుగుణంగా న్యాయశాఖ పరిధిలో భవనాలు ఏవీ అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలోని క్రీడా వికాస కేంద్రాన్ని తాత్కాలికంగా అదనపు కోర్టు భవనంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా క్రీడా వికాస కేంద్రంలో అదనపు కోర్టు నిర్వహణకు అవసరమైన పనులను గత కొంతకాలంగా చేపడుతున్నారు. తది దశలో జరుగుతున్న ఈ పనులను ఇరువురు న్యాయశాఖ అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వెంట ఆత్మకూరు సీనియర్‌, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారులు శోభారాణి, రాహుల్‌ అంబేడ్కర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బొల్లు నగేష్‌, సుదర్శన్‌ ఉన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:16 AM