ప్రజలకు అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:24 AM
సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం మండలంలోని ఆర్.కొత్తపల్లె గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
బేతంచెర్ల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం మండలంలోని ఆర్.కొత్తపల్లె గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటంచాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామ సచివాలయ సిబ్బంది పనితీరును గ్రామ ప్రజలతో మాట్లాడి కలెక్టర్ తెలుసుకున్నారు. ఆర్.కొత్తపల్లె పంచాయతీ కార్యదర్శి హరిత, డిజిటల్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు ఉన్నారు