Share News

అద్దె చెల్లించని షాపులు సీజ్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:49 PM

నగర పాలక సంస్థకు చెందిన షాపులను లీజుకు తీసుకుని అద్దెలు చెల్లించని దుకాణాలను సీజ్‌ చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆదేశించారు.

అద్దె చెల్లించని షాపులు సీజ్‌
మున్సిపల్‌ సిబ్బందికి సూచనలిస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, జూన 4(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థకు చెందిన షాపులను లీజుకు తీసుకుని అద్దెలు చెల్లించని దుకాణాలను సీజ్‌ చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆదేశించారు. గురువారం ఆయన కల్లూరు, రైల్వేస్టేషన, ఎనఆర్‌పేట, కొత్తపేట ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్‌ షాపులను పరిశీలించారు. కొంతమంది లీజుదారులు షాపులను ఇతరులకు అద్దెకు ఇచ్చి అధిక మొత్తంలో వసూలు చేసుకుంటూ, కార్పొరేషనకు చెల్లించా ల్సిన అద్దెలను నిర్లక్ష్యం చేయడంపై కమిషనర్‌ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సెట్కూరు కార్యాలయంలో సమీపం లోని అన్న క్యాంటీనను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఓలు జునైద్‌, స్వర్ణలత, వాజిద్‌, ఆర్‌ఐలు రాజు, భార్గవ్‌, శానిటేషన ఇన్సప్పెక్టర్‌ కూర్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 11:50 PM