Share News

వైసీపీకి షాక్‌

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:20 AM

రోజురోజుకు తెలుగేశం పార్టీలో చేరికలు అధికమవుతుండటంతో వైసీపీ నాయకులకు భారీ షాక్‌ తగులుతోంది. శనివారం చనుగొండ్ల మాజీ సర్పంచ్‌ దేవేంద్రతో పాటు 40 కుటుంబాలు, ఇంద్రాంపల్లె గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సమక్షంలో టీడీపీలో చేరాయి.

వైసీపీకి షాక్‌
ఎమ్మెల్యే కోట్లను గజమాలతో సన్మానిస్తున్న చనుగొండ్ల, ఇంద్రాంపల్లి వాసులు

టీడీపీలోకి మాజీ సర్పంచ్‌, 50 కుటుంబాలు

డోన్‌ టౌన్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రోజురోజుకు తెలుగేశం పార్టీలో చేరికలు అధికమవుతుండటంతో వైసీపీ నాయకులకు భారీ షాక్‌ తగులుతోంది. శనివారం చనుగొండ్ల మాజీ సర్పంచ్‌ దేవేంద్రతో పాటు 40 కుటుంబాలు, ఇంద్రాంపల్లె గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సమక్షంలో టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రజల్లో రోజురోజుకు టీడీపీపై నమ్మకం పెరుగతుందని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేలోపు అన్నీ గ్రామాల్లో వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ రాజానారాయణమూర్తి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చనుగొండ్ల శ్రీరాములు, వెంకోబరావు, పెద్దపూజల్ల కమతం భాస్కర్‌ రెడ్డి, మిద్దెపల్లె గోవిందు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను భారీ గజమాలతో సత్కరించారు.

తాగునీటి మళ్లింపుపై కోట్ల ఆగ్రహం

మండలంలోని ఇందిరాంపల్లె గ్రామంలో హంద్రీనీవా కాలువ నుంచి నీటిని కొందరు అక్రమంగా పొలాలకు మళ్లించుకోవడంపై కోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని ఇలా పొలాలకు మళ్లిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Updated Date - Oct 04 , 2026 | 12:20 AM