Share News

మహానందిలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Feb 13 , 2026 | 11:05 PM

: మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమ య్యా యి.

మహానందిలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
రావణవాహనంపై స్వామి, అమ్మవార్లు

మహానంది, పిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమ య్యా యి. ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఉదయం ప్రధాన ఆలయాల్లోని స్వామి,అమ్మవార్లకు వేదపండితులు ప్రత్యేక పూజ లు నిర్వహించి కంకణధారణ చేశారు. అనంతరం వివిధ రకాల పూజల చేపట్టారు. రాత్రి 8 గంటలకు ఆలయం ప్రాంగణంలో ధ్వజారోహణం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు రావణ వాహానసేవను నిర్వహించారు. అనంతరం క్షేత్ర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.

స్వామి, అమ్మవార్లకు బంగారు: మహానంది క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు హైదరాబాద్‌కు చెందిన సుబ్రహ్మణ్యం, సంధ్యారాణి దంపతులు రూ.3 లక్షల విలువ చేసే పాశంకుశాలు, అభయ హస్తాలను అందజేశారు.

స్వామివారి సేవలో ‘చాగంటి’

మహానంది క్షేత్రంలో శుక్రవారం ప్రభుత్వ సలహదారుడు, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజలు జరిపా రు. వీరికి ఆలయం వద్ద ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చ కులు స్వాగతం పలికారు. అనంతరం చాగంటి దంపతులు ప్రధాన ఆలయాల్లో స్వామి,అమ్మవార్లను దర్శించుకొన్నారు. కల్యాణమంటపంలో వేదపండితులు రవిశంకర్‌ అవధాని వీరిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి ప్రసాదాలతో పాటు స్వామివారి జ్ఞాపికను అందజేశారు.

Updated Date - Feb 13 , 2026 | 11:05 PM