13 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:28 PM
మహానంది క్షేత్రంలో ఈనెల 13 నుంచి 18 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మహానంది, ఫిబ్రవరి 4 (ఆంరఽధజ్యోతి): మహానంది క్షేత్రంలో ఈనెల 13 నుంచి 18 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో బ్రహ్మోత్సవాల గోడ పత్రికలతో పాటు ఆహ్వాన పత్రికలను వేదపండితులు, అర్చకులు పూజలు జరిపి ఆవిష్కరించారు. దేవస్ధానం పరిపాలన భవనంలో ఈవో మాట్లాడుతూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవా లను బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. స్ధానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి ఆయన స్వగృహంలో ఆహ్వన పత్రిక లను అందజేశామన్నారు. ఈనెల 12వ తేదీ ప్రభుత్వ సలహ దారుడు, చాగంటి కోటేశ్వరరావు మహానందికి వస్తున్నట్లు ఈవో చెప్పారు. ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో రూ.30 లక్షలతో నిర్మించిన కళావేదిక సభా ప్రాంగణాన్ని ఆయన చేత ప్రారంభిస్తామన్నారు. అదే రోజు 5 గంటలకు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఉంటాయని అన్నారు. ఆలయ ఏఈవో మధు, సిబ్బంది పాలొ ్గన్నారు.