శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:50 PM
ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి ఉమా మహేశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మాత్సవాలు శనివారం ధ్వజారోహణంతో సంప్రదాయ బద్ధంగా ప్రారంభమయ్యాయి.
బనగానపల్లె, ఫిబ్రవరి 14 (ఆంఽఽధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి ఉమా మహేశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మాత్సవాలు శనివారం ధ్వజారోహణంతో సంప్రదాయ బద్ధంగా ప్రారంభమయ్యాయి. ఉమామహేశ్వరస్వామివారి విగ్రహాలను ఆలయ చైర్మన్ మౌళీశ్వరరెడ్డి, పాలకవర్గ సభ్యుడు, అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డితో పాటు పూజారులు ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకులు మహేశ్ శర్మ, కిశోర్, చిన్నస్వామి, ఆనందశర్మ ఆధ్వర్యంలో ఉదయం 5గంటలకు ఉమామహేశ్వరస్వామి వారికి మహాన్యాసక రుద్రాభిషేకం, రుద్రా భిషేకం, కుంకుమార్చన, సహస్ర నామావళి నిర్వహించారు. వేద మంత్రోచ్చరణాల మధ్య ఉదయం 8గంటలకు ఉత్సవమూర్తులకు పూజలుచేసి ధ్వజారోహణ కార్యక్రమం చేప ట్టారు. యాగంటికి ఆదివారం వేలాది మంది భక్తుల రానుండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ మౌళీశ్వరరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి శనివారం తెలిపారు. చిన్నకోనేరు, పెద్ద కోనేరు వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.