Share News

మహిళల రక్షణకు శక్తి యాప్‌

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:07 AM

మహిళల రక్షణకు ప్రభుత్వం శక్తియా్‌పను ప్రవేశపెట్టింది. యాప్‌పై అవగాహన కల్పించేందుకు పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

మహిళల రక్షణకు శక్తి యాప్‌
చిన్నమల్కాపురంలో అవగాహన కల్పిస్తున్న రూరల్‌ ఎస్‌ఐ మమత

అత్యవసర సమయాల్లో తక్షణ పోలీసు సాయం

విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులు

డోన్‌ రూరల్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మహిళల రక్షణకు ప్రభుత్వం శక్తియా్‌పను ప్రవేశపెట్టింది. యాప్‌పై అవగాహన కల్పించేందుకు పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. డోన్‌ మండలంలోని గ్రామాల్లో మహిళలకు, బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొత్తపల్లి, ఉడుములపాడు, దొరపల్లి, గుమ్మకొండ, మల్లెంపల్లె, ఎద్దుపెంట గ్రామాల్లో రూరల్‌ సీఐ సీఎం రాకేష్‌, ఎస్‌ఐ మమత చట్టాలపై అవగాహన కల్పించారు. పట్టణంలోని శ్రీరాంనగర్‌, కొండపేట, పాతపేట, వైఎస్సార్‌ నగర్‌లో పట్టణ సీఐ ఇంతియాజ్‌ బాషా ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. .

శక్తియా్‌పతో తక్షణ సాయం

శక్తి యాప్‌ను మహిళలు, బాలికల రక్షణ కోసమే రూపొందంచారు. ప్రతి మహిళ తన ఫోన్‌లో యాప్‌ను డోన్‌లోడ్‌ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసర సమయాలు, ఆపదల్లో యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితో నిమిషాల్లో పోలీసులు చేరుకుని సాయం అందించే అవకాశం ఉంది. వీటితో పాటు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పింయిచ బాలికా విద్యను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నారు. బాల్య వివాహాల సమాచారం 1098 నెంబరుకు ఇవ్వాలని, అత్యవసర సమయాల్లో 112, 100కు ఫోన్‌చేసి రక్షణ పొందాలని పోలీసులు కోరారు.

మహిళల రక్షణే లక్ష్యం

మహిళల రక్షణ కోసమే శక్తియాప్‌ రూపొందించాం. ఇప్పటికే విస్తృతంగా అవగాహన కర్యాక్రమాలు నిర్వహిస్తున్నాం. సమస్యలున్న మహిళలు పోలీసుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలి. - శ్రీనివాసులు, డీఎస్పీ, డోన్‌

Updated Date - Aug 31 , 2026 | 12:07 AM