‘మత్తు’ వదలండి
ABN , Publish Date - Jun 26 , 2026 | 11:11 PM
విద్యార్థులు మాదక ద్రవ్యాల మత్తు వదలాలని నంద్యాల అడిషనల్ ఏఎస్‌పీ ఎం. జావళి అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించారు.
లక్ష్యం మీద కేంద్రీకరిస్తేనే విద్యార్థులకు భవిష్యత్తు
ఏఎస్‌పీ ఎ. జావళి
నంద్యాల క్రైం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు మాదక ద్రవ్యాల మత్తు వదలాలని నంద్యాల అడిషనల్ ఏఎస్‌పీ ఎం. జావళి అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాల పట్టణ కేంద్రంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జావళి మాట్లాడుతూ గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని అన్నారు. లక్ష్యం మీద కేంద్రీకరిస్తేనే విద్యర్థులకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.