శైవకాల వివేకం తెలుగు గ్రంథావిష్కరణ
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:02 AM
శైవాగమ శాస్త్ర సంబంధిత గ్రంథాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఉగాది సందర్భంగా అక్కమహాదేవి అలంకార మండపంలో శైవకాల వివేకం అనే తెలుగు అనువాద గ్రం థాన్ని ఆవిష్కరించిన ఆమె మాట్లాడారు.
శ్రీశైలం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): శైవాగమ శాస్త్ర సంబంధిత గ్రంథాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఉగాది సందర్భంగా అక్కమహాదేవి అలంకార మండపంలో శైవకాల వివేకం అనే తెలుగు అనువాద గ్రం థాన్ని ఆవిష్కరించిన ఆమె మాట్లాడారు. 16వ శతాబ్దకాలంనాటి నిగ మాగమఙ్ఞాన శివాచార్యులు రచించిన శైవాగమ గ్రంథాలలోని ప్రధా నంశాలను క్రోడీకరించి ఈ గ్రంథాన్ని రచించిన శ్రీశైలప్రభ సహాయ సంపాదకుడు సత్యబ్రహ్మను అభినందించారు. శివాలయాలలో శైవ సంప్రదాయంగా చేసే ఆలయ నిర్మాణం, ముహూర్త నిర్ణయాలు, ప్రతిష్ఠలు, అర్చన, పూజా విధానాలు క్షుణ్ణంగా ఉండే ఈ గ్రంథం భక్తులకు మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుతుందని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు ఉన్నారు.